Telugudesam: ముద్రగడతో టీడీపీ భేటీ.. పిఠాపురం టికెట్ ఆఫర్!

  • ముద్రగడను ఒప్పించేందుకు ప్రయత్నం
  • రాష్ట్రమంతా ప్రచారం చేయాలని సూచన
  • జేఏసీ నేతల మాటేంటన్న ముద్రగడ

ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఎవరి వ్యూహ రచనలు వాళ్లు చేస్తున్నారు. దొరికిన ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోకుండా శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ.. కాపు సామాజిక వర్గంపై దృష్టి పెట్టింది. ఎలాగైనా ముద్రగడ పద్మనాభంను ఒప్పించి తమ పార్టీలో చేర్చుకునేందుకు అస్త్రాలు సిద్ధం చేస్తోంది. నేడు టీడీపీ నేతలు ముద్రగడతో పాటు కాపు జేఏసీ నేతలతో సమావేశమయ్యారు.

పిఠాపురం టీడీపీ టికెట్ కేటాయిస్తామని.. రాష్ట్రమంతా తిరిగి తమ పార్టీ తరుపున ప్రచారం చేయాలని ముద్రగడను టీడీపీ నేతలు కోరినట్టు సమాచారం. అయితే ముద్రగడ కాపు జేఏసీల విషయమై టీడీపీ నేతలను ప్రశ్నించినట్టు తెలుస్తోంది. దీంతో మరోసారి మాట్లాడుదామని వారు వెళ్లిపోయినట్టు సమాచారం. మొత్తమ్మీద ముద్రగడను తమ పార్టీలో చేర్చుకుని కాపు సామాజిక వర్గానికి చెందిన ఓట్లను పూర్తి స్థాయిలో రాబట్టే దిశగా టీడీపీ అడుగులు వేస్తోందని తెలుస్తోంది.

Telugudesam
Mudragada Padmanabham
Kapu Community
Pithapuram
Kapu JAC
  • Loading...

More Telugu News