Telugudesam: టీడీపీకి రాజీనామా చేసిన పి.గన్నవరం ఎమ్మెల్యే

  • టికెట్‌ను స్టాలిన్‌బాబుకు కేటాయించడంతో మనస్తాపం
  • స్వతంత్ర అభ్యర్థిగా పోటీ
  • గతంలో వైసీపీ అభ్యర్థిపై ఘన విజయం

ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ పార్టీలకు షాకులు తగులుతూనే ఉన్నాయి. ఒక పార్టీ నుంచి మరొక పార్టీకి జంపింగ్ జపాంగ్‌లు పెరుగుతూనే ఉన్నారు. తాజాగా టీడీపీకి మరో షాక్ తగిలింది. తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి ఆ పార్టీకి రాజీనామా చేశారు. గన్నవరం ఎమ్మెల్యే టికెట్‌ను నేలపూడి స్టాలిన్‌బాబుకు కేటాయించడంతో అసంతృప్తికి లోనైన ఆయన పార్టీకి రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నట్టు ప్రకటించారు. 2014లో వైసీపీ అభ్యర్థి చిట్టిబాబుపై 13 వేల పై చిలుకు ఓట్లతో ఘన విజయం సాధించారు.

Telugudesam
Pulaparthy Narayana Murthy
Stalin Babu
Gannavaram
YSRCP
  • Loading...

More Telugu News