jagan: సొంత బాబాయ్ చనిపోతే జగన్ ఇంత వరకు ఎందుకు మాట్లాడలేదు?: బుద్ధా వెంకన్న

  • జగన్ కుటుంబంతో తప్ప ఇతరులతో వివేకాకు విభేదాలు లేవు
  • రక్తపు మరకలను ఎందుకు తుడిచేశారు?
  • లోటస్ పాండ్ లో కూర్చొని శవ రాజకీయాలకు తెర లేపారు

వైయస్ వివేకానందరెడ్డి మృతి వెనుక తమకు అనేక అనుమానాలున్నాయని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న అన్నారు. సొంత బాబాయ్ చనిపోతే వైసీపీ అధినేత జగన్ ఇంతవరకు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. జగన్ కుటుంబంతో తప్ప వివేకాకు ఇతరులతో విభేదాలు లేవని అన్నారు. గుండె పోటుతో చనిపోయినట్టు తొలుత ఎందుకు ప్రకటించారని... రక్తపు మరకలను ఎందుకు తుడిచేశారని ప్రశ్నించారు. లోటస్ పాండ్ లో కూర్చొని శవ రాజకీయాలకు తెరలేపారని విమర్శించారు. వివేకా హత్యను అడ్డం పెట్టుకుని ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టించేందుకు కుట్ర పన్నారని అన్నారు. 

jagan
ys viveka
budda venkanna
ysrcp
Telugudesam
  • Loading...

More Telugu News