ys viveka: కడప, పులివెందులను గెలుస్తామని టీడీపీ నేతలు పదే పదే చెప్పారు.. సిట్ పై నమ్మకం లేదు: వాసిరెడ్డి పద్మ

  • ఆదినారాయణరెడ్డిని ఎంపీ అభ్యర్థిగా ప్రకటించినప్పుడే.. మహా కుట్రకు బీజం పడింది
  • జమ్మలమడుగులో ఆయన ఎలాంటి అకృత్యాలకు పాల్పడ్డారో అందరికీ తెలుసు
  • వివేకా మరణంపై సీబీఐ విచారణ జరిపించాలి

వైయస్ వివేకా మరణం పలు అనుమానాలకు తావిస్తోందని వైసీపీ నాయకురాలు వాసిరెడ్డి పద్మ అన్నారు. కడప టీడీపీ ఎంపీ అభ్యర్థిగా ఆదినారాయణరెడ్డిని ప్రకటించినప్పుడే... మహా కుట్రకు బీజం పడిందని ఆమె ఆరోపించారు. కడపను కొడతామని, పులివెందులను గెలుస్తామని టీడీపీ నేతలు పదేపదే చెప్పారని అన్నారు. టీడీపీ నేతల వ్యాఖ్యల వెనక ఉన్న ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. జమ్మలమడుగులో ఆదినారాయణరెడ్డి ఎలాంటి అకృత్యాలకు పాల్పడ్డారో అందరికీ తెలుసని చెప్పారు.

వివేకా మరణంపై నిష్పక్షపాతంగా విచారణ జరగాలని వాసిరెడ్డి పద్మ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ తో నిజనిజాలు వెలుగు చూస్తాయనే నమ్మకం తమకు లేదని చెప్పారు. అసలైన నిజాలు వెలుగు చూడాలంటే సీబీఐ చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

ys viveka
death
cbi
vasireddy padma
adinarayana reddy
ysrcp
Telugudesam
kadapa
pulivendula
  • Loading...

More Telugu News