jagan: జగన్ కంపెనీకి ఇచ్చిన భూమిని కేసీఆర్ ప్రభుత్వం ఎందుకు వెనక్కి తీసుకోలేదు?: వీహెచ్

  • జగన్ భూమి విషయంలో సీబీఐ ఎందుకు మౌనంగా ఉంది?
  • మోదీకి జగన్ అవినీతిపరుడిలా కనిపించడం లేదా?
  • వైయస్ వివేకా మరణంపై అనుమానాలున్నాయి

వైసీపీ అధినేత జగన్ కు చెందిన యాగా కంపెనీకి ఇచ్చిన భూమిని కేసీఆర్ ప్రభుత్వం ఎందుకు వెనక్కి తీసుకోలేదని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ప్రశ్నించారు. ఈ భూమి విషయంలో సీబీఐ మౌనంగా ఎందుకు ఉందని అన్నారు. రేవంత్ రెడ్డికి ఒక నీతి, జగన్ కు ఒక నీతా? అని అడిగారు. ప్రధాని మోదీకి జగన్ అవినీతిపరుడిలా కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. తెలంగాణలో ప్రతిపక్షం లేకుండా చేయాలని కేసీఆర్ చూస్తున్నారని విమర్శించారు. పార్టీ ఫిరాయింపులు వ్యభిచారం కంటే నీచమైనవని అన్నారు. వైయస్ వివేకానందరెడ్డి మృతి తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని చెప్పారు. ఆయన మరణంపై అనుమానాలు ఉన్నాయని అన్నారు. 

jagan
vh
congress
kcr
TRS
revanth reddy
ys viveka
  • Loading...

More Telugu News