Tollywood: 'కారు ప్రమాదంలో హీరో సునీల్ దుర్మరణం' అంటూ వదంతులు.. ఆ వార్తలను నమ్మవద్దంటూ ట్వీట్ చేసిన సునీల్!

- సోషల్ మీడియాలో నకిలీవార్తల కలకలం
- రోడ్డు ప్రమాదంలో సునీల్ దుర్మరణం అంటూ వార్తలు
- ఇలాంటివి నమ్మవద్దని అభిమానులకు సునీల్ విజ్ఞప్తి
సోషల్ మీడియా వచ్చాక వదంతులు, పుకార్లకు కొదవలేకుండా పోయింది. ఫలానా సెలబ్రిటి చనిపోయారు. ఫలానా హీరో తండ్రి గాయపడ్డాడు అంటూ గాసిప్ వార్తలతో అభిమానులను కలవరానికి గురిచేస్తున్నారు. అలాంటి ఘటన ఒకటి తాజాగా చోటుచేసుకుంది.
టాలీవుడ్ హీరో సునీల్ ఈరోజు కారు ప్రమాదంలో మరణించారని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆయన్ను కడసారిగా చూసేందుకు టాలీవుడ్ ప్రముఖులు వచ్చినట్లు మార్ఫింగ్ ఫొటోలను వాటికి జతచేశారు.
