ys viveka: వైయస్ వివేకా మృతిపై ఎన్ఐఏ, తెలంగాణ పోలీసుల విచారణకు జగన్ ఎందుకు అడగడం లేదు?: సీఎం రమేష్

  • వివేకా మరణం అనుమానాస్పదంగా ఉంది
  • అసలైన వాస్తవాలని వెలికి తీయాలి
  • వివేకా మరణాన్ని వైసీపీ రాజకీయంగా వాడుకోవాలనుకుంటోంది

వైయస్ వివేకానందరెడ్డి మృతి రాజకీయరంగును పులుముకుంది. మరణం అనుమాస్పదంగా ఉందంటూ అధికార, ప్రతిపక్షాలు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ ఎంపీ సీఎం రమేష్ కడపలో మీడియాతో మాట్లాడుతూ, వివేకా మరణం సహజంగా లేదని, చాలా అనుమానాస్పదంగా ఉందని అన్నారు.

మృతిపై దర్యాప్తు జరిపి, అసలైన వాస్తవాలను వెలికి తీయాలని డిమాండ్ చేశారు. వివేకా మృతిపై సీబీఐ, ఎన్ఐఏ విచారణకు వైసీపీ అధినేత జగన్ ఎందుకు డిమాండ్ చేయడం లేదని ప్రశ్నించారు. ఆయనకు ఎంతో నమ్మకమైన తెలంగాణ పోలీసులతో విచారణ జరిపించుకోవచ్చు కదా అని అన్నారు. వివేకా మరణాన్ని కూడా రాజకీయ లబ్ధి కోసం వైసీపీ వాడుకోవాలనుకుంటోందని విమర్శించారు.

ys viveka
death
ysrcp
Telugudesam
cm ramesh
jagan
  • Loading...

More Telugu News