Australia: 49కి చేరిన న్యూజిలాండ్ మృతుల సంఖ్య
- చెల్లాచెదురుగా మృతదేహాలు
- పోలీసుల అదుపులో నలుగురు వ్యక్తులు
- వారిలో ఒకరు మహిళ
ఎంతో ప్రశాంతమైన దేశంగా పేరుగాంచిన న్యూజిలాండ్ అనూహ్యరీతిలో రక్తసిక్తం అయింది. తుపాకీ చేతబట్టిన ఓ దుండగుడు క్రైస్ట్ చర్చ్ నగరంలోని మసీదుల వద్ద విచక్షణ రహితంగా జరిపిన కాల్పుల్లో మరణించిన వారి సంఖ్య 49కి చేరింది. 20 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనలో అనుమానితులుగా భావిస్తూ న్యూజిలాండ్ పోలీసులు నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఒక మహిళ కూడా ఉన్నట్టు తెలుస్తోంది.
న్యూజిలాండ్ పోలీసుల కస్టడీలో ఉన్న నలుగురిలో ఒకరు ఆస్ట్రేలియన్ అని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ ధ్రువీకరించారు. ప్రపంచవ్యాప్తంగా ఇస్లామిక్ దేశాల్లో ఈ ఘటనపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. కాగా, న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న బంగ్లాదేశ్ జాతీయ క్రికెట్ జట్టు క్రైస్ట్ చర్చ్ కాల్పుల ఘటనలో తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకుంది. క్రైస్ట్ చర్చ్ కాల్పుల నేపథ్యంలో న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్ల మధ్య ఇక్కడ జరగాల్సిన మూడో టెస్టును రద్దు చేశారు.