ys vivekananda reddy: వివేకానందరెడ్డి మృతి పట్ల అనుమానాలపై చంద్రబాబు స్పందన

  • పోలీసు అధికారులతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించిన చంద్రబాబు
  • అత్యున్నత స్థాయిలో దర్యాప్తు చేయాలని ఆదేశాలు
  • ఎవరి హస్తం ఉన్నా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశం

వైయస్ వివేకానందరెడ్డి మృతిపై అనుమానాలున్నాయని వైసీపీ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. మృతి వెనుక ఎవరి హస్తం ఉన్నా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. పోలీసు ఉన్నతాధికారులతో ఆయన అత్యవసరంగా సమావేశమై చర్చించారు. డీజీపీ, ఇంటెలిజెన్స్ అధికారులు, కడప జిల్లా పోలీసు అధికారులతో మాట్లాడారు. వివేకా మృతిపై అత్యున్నత స్థాయిలో దర్యాప్తు చేయాలని ఆదేశించారు. వెంటనే పత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించాలని ఆదేశాలు జారీ చేశారు. దోషులను అరెస్ట్ చేయాలని, కఠినంగా శిక్షించాలని అన్నారు. 

ys vivekananda reddy
death
chandrababu
sit
  • Loading...

More Telugu News