Andhra Pradesh: కుటుంబ సభ్యులతో కలసి కారులో పులివెందులకు బయలుదేరిన జగన్!

  • కుటుంబ సభ్యులతో కలిసి జిల్లాకు పయనం
  • ఈరోజు తుదిశ్వాస విడిచిన వివేకానందరెడ్డి
  • ఇంట్లో ఆధారాలు సేకరిస్తున్న క్లూస్, ఫోరెన్సిక్ బృందాలు

వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి ఈరోజు చనిపోయిన సంగతి తెలిసిందే. గుండెపోటుతో వివేకానందరెడ్డి మృతి చెందారని చెబుతున్నప్పటికీ ఆయన మరణంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తల ముందు, వెనుక భాగంతో పాటు చేతికి గాయం కావడంతో ఇది కుట్రేనని ఆయన కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. కాగా, వివేకానంద రెడ్డి మరణవార్త తెలుసుకున్న వైసీపీ అధినేత జగన్ కుటుంబసభ్యులతో కలిసి హుటాహుటిన పులివెందులకు బయలుదేరారు.

హైదరాబాద్ నుంచి కార్లలో జగన్ తన కుటుంబంతో కలిసి కడపకు చేరుకోనున్నారు. కుటుంబ సభ్యులందరూ పులివెందులకు చేరుకున్నాక వైఎస్ వివేకానందరెడ్డి అంత్యక్రియలను ఈరోజు సాయంత్రం లేదా రేపు ఉదయం నిర్వహించే అవకాశముందని సన్నిహితవర్గాలు తెలిపాయి.

మరోవైపు వివేకానందరెడ్డి భౌతికకాయానికి పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. కాగా, ఆయన ఇంటికి చేరుకున్న ఫోరెన్సిక్, క్లూస్ టీమ్ సాక్ష్యాలను సేకరిస్తున్నాయి.

Andhra Pradesh
Kadapa District
YSRCP
Jagan
vivekananda reddy
pulivendula
death
going home
  • Loading...

More Telugu News