Andhra Pradesh: ఫామ్-6 దాఖలుకు ఇదే చివరిరోజు.. ప్రజలంతా ఓటును పరిశీలించుకోండి!: ఏపీ సీఎం చంద్రబాబు

  • సైబర్ నేరస్తులు, ఓటు దొంగలు ఉన్నారు
  • ప్రజల ఓట్లను తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారు
  • ప్రతీఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి

ఏపీలో ఓటర్లుగా దరఖాస్తు సమర్పించడం కోసం ఫామ్-6 దాఖలు చేసేందుకు ఇదే చివరి రోజని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రతీఒక్కరూ తమ ఓటు ఉందో లేదో పరిశీలించుకోవాలని కోరారు. సైబర్ నేరస్తులు, ఓటు దొంగలు ప్రజల ఓట్లను తొలగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. వీరంతా టెక్నాలజీ సాయంతో గతంలోలాగే ఇప్పుడూ ప్రజల ఓట్లను తీసేస్తున్నారని వ్యాఖ్యానించారు.

ప్రజలంతా తమతో పాటు తమ పిల్లల భవిష్యత్తు కోసం ఏప్రిల్ 11న ఓటు హక్కును వినియోగించుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ‘విభజన హామీల అమలులో మోసాలు, కుట్రలు, రాష్ట్రాభివృద్ధిని అడ్డుకునే ప్రతిపక్షాలు ఇలా.. ఏపీ ప్రస్తుతం కీలకదశలో ఉంది. కాబట్టి ప్రతీఒక్కరూ చాలా జాగ్రత్తగా ఉండాలి’ అని వరుస ట్వీట్లు చేశారు.

Andhra Pradesh
Chandrababu
Twitter
form-6
last day
  • Loading...

More Telugu News