Andhra Pradesh: కామంతో కళ్లు మూసుకుపోయి మనవరాలిపై అత్యాచారం చేసిన తాత!

  • ఏపీలోని కర్నూలు జిల్లాలో ఘటన
  • మతిస్థిమితం లేని మనవరాలిపై అఘాయిత్యం
  • వైద్య పరీక్షల కోసం యువతి ఆసుపత్రికి తరలింపు

సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునే ఘటన ఇది. కామాంధుడిగా మారిన ఓ వ్యక్తి మనవరాలిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఆమెను గర్భవతిని చేశాడు. చివరికి ఈ విషయం బయటకు పొక్కడంతో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి కటకటాల వెనక్కు నెట్టారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని కోవెలకుంట్లలో చోటుచేసుకుంది.

కోవెలకుంట్ల మండలం ఎం.ఉప్పలూరు గ్రామానికి చెందిన జి.పుల్లయ్య(60) వరుసకు మనవరాలు అయ్యే ఓ యువతి(16)పై కన్నేశాడు. ఆమెకు మతిస్థిమితం లేకపోవడంతో బాధితురాలిపై పలుమార్లు అత్యాచారం చేశాడు. ఈ నేపథ్యంలో ఇటీవల యువతి అనారోగ్యానికి గురికావడంతో కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు.

అక్కడ యువతిని పరీక్షించిన వైద్యులు ఆమె ఆరో నెల గర్భవతి అని తేల్చారు. దీంతో కుటుంబ సభ్యులు నిలదీయగా తానే లైంగికదాడికి పాల్పడ్డానని పుల్లయ్య అంగీకరించాడు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదుచేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరిచారు. అనంతరం న్యాయమూర్తి ఆదేశాలతో రిమాండ్ కు తరలించారు. యువతిని వైద్య పరీక్షల కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Andhra Pradesh
Kurnool District
rape
grand father
grand daughter
  • Loading...

More Telugu News