Viveka: తలకు బలమైన గాయం... వివేకా మృతిపై అనుమానాలు... రంగంలోకి దిగిన పోలీసులు!

  • ఈ తెల్లవారుజామున మరణించిన వివేకా
  • తలకు, చేతికి బలమైన గాయాలు
  • మృతదేహం రక్తపు మడుగులో

ఈ తెల్లవారుజామున పులివెందులలోని తన ఇంటి బాత్ రూమ్ లో వైఎస్ వివేకానందరెడ్డి విగతజీవిగా కనిపించగా, ఆయన మృతి వెనుక అనుమానాలు ఉన్నాయని వివేకా పీఏ కృష్ణారెడ్డి పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు ప్రారంభించారు. వివేకా మృతదేహం రక్తపు మడుగులో కనిపించిందని చెప్పిన ఆయన, తలకు, చేతికి బలమైన గాయాలు కనిపిస్తున్నాయని తెలిపారు. కృష్ణారెడ్డి ఫిర్యాదుతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

Viveka
Died
PA
Krishnareddy
Police
  • Loading...

More Telugu News