ys Viveka: నిన్న కూడా ప్రజల మధ్యే... వైఎస్ వివేకా చివరి ఫోటోలు!

  • చాపాడు మండలంలో ప్రచారం
  • ఇంటింటికీ తిరిగి వైసీపీని గెలిపించాలని ప్రచారం
  • 11 గంటలకు ఇంటికి బయలుదేరిన వివేకా

వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరుడు, జగన్ బాబాయ్ వైఎస్‌ వివేకానందరెడ్డి హఠాన్మరణం పులివెందుల ప్రజలను తీవ్రంగా కలచివేస్తున్న వేళ, మరణానికి కొద్ది గంటల ముందు కూడా ఆయన ప్రజల మధ్య తిరుగుతూ, రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి, పలకరిస్తూ ఉత్సాహంగా కనిపించారు. ఇప్పుడాయన చివరి ఫోటోలు వైరల్ అవుతున్నాయి.నిన్న ఆయన చాపాడు మండలంలో ప్రచారం నిర్వహించారని రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌ రెడ్డి గుర్తు చేసుకున్నారు. ఆయన మరణం తనకు చాలా బాధ కలిగించిందని, తమ కుటుంబాల మధ్య ఎంతో సాన్నిహిత్యం ఉండేదని చెప్పుకొచ్చారు. బాబాయ్ అంటే జగన్ కు ఎంతో అభిమానమని అన్నారు. నిన్న రాత్రి 11 గంటల వరకూ కూడా ఆయన తన ముఖ్య అనుచరులతో సమావేశం నిర్వహించి, ఆపై ఇంటికెళ్లారని చెప్పారు.

ys Viveka
Last Photos
Died
  • Loading...

More Telugu News