vijay: 64వ సినిమాను లైన్లో పెట్టేసిన విజయ్

  • అట్లీ కుమార్ తో విజయ్ 
  • మోహన్ రాజాకి గ్రీన్ సిగ్నల్
  •  త్వరలోనే మిగతా వివరాలు      

తమిళనాట వరుస సినిమాలతో .. వరుస విజయాలతో విజయ్ దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ఆయన తన 63వ సినిమా షూటింగులో బిజీగా వున్నాడు. క్రీడా నేపథ్యంలో సాగే ఈ సినిమాకి అట్లీ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో కథానాయికగా నయనతార కనిపించనుంది. విజయ్ అభిమానులంతా ఈ సినిమా విశేషాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఆసక్తిని చూపిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే విజయ్ మరో దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు .. ఆ దర్శకుడి పేరే .. మోహన్ రాజా. ఈ పేరు వినగానే 'తని ఒరువన్' వంటి బ్లాక్ బస్టర్ హిట్ గుర్తుకు వస్తుంది. గతంలో మోహన్ రాజా .. విజయ్ తో కలిసి 'వేలాయుధమ్' అనే సినిమా చేశాడు. మళ్లీ ఇంతకాలానికి వీళ్ల కాంబినేషన్ సెట్స్ పైకి వెళ్లడానికి రెడీ అవుతోంది. ఈ సినిమా కోసం అనిరుధ్ ను సంగీత దర్శకుడిగా తీసుకున్నారు. త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి.

  • Loading...

More Telugu News