Nara Lokesh: లోకేశ్ పిట్టల దొరలా వ్యవహరిస్తున్నారు: బీజేపీ నేత విష్ణువర్థన్‌రెడ్డి

  • పౌరుషం ఉంటే జగన్‌పై నిలబడి గెలవాలి
  • జగన్‌ను నెత్తిన పెట్టుకోవాల్సిన అవసరం లేదు
  • దొడ్డిదారిన జీవోలు పాస్ చేస్తున్నారు

ఏపీ బీజేపీ నేత విష్ణువర్థన్‌రెడ్డి మంత్రి నారా లోకేశ్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ, వైసీపీ కలిసిపోయాయంటూ ప్రచారం చేయడం లోకేశ్ దిగజారుడుతనానికి నిదర్శనమని దుయ్యబట్టారు. లోకేశ్ పిట్టలదొరలా వ్యవహరిస్తున్నారని.. రాయలసీమ పౌరుషం ఉంటే జగన్‌పై నిలబడి గెలవాలని సవాల్ విసిరారు.

జగన్‌ను కాపాడి నెత్తిన పెట్టుకోవాల్సిన అవసరం తమకు లేదన్నారు. అమరావతిలో చంద్రబాబు ఇల్లు కట్టుకోలేదు కానీ ఇతర పార్టీల నేతలు హైదరాబాద్‌లో ఉంటే మాత్రం ప్రశ్నిస్తున్నారని దుయ్యబట్టారు. ఏపీలో తొలిదశలో ఎన్నికలు జరిపించడాన్ని కుట్రగా పరిగణించడం సిగ్గుచేటన్నారు. ప్రస్తుతం ఎన్నికల్ కోడ్ అమలులో ఉన్నప్పటికీ దొడ్డిదారిన జీవోలు పాస్ చేస్తున్నారని విష్ణువర్థన్‌రెడ్డి ఆరోపించారు.

Nara Lokesh
Vishnu Vardhan Reddy
Jagan
BJP
YSRCP
Chandrababu
  • Loading...

More Telugu News