Pawan Kalyan: రియల్ లైఫ్ లో తొడలుకొడితే సరిపోతుందా?: జనసేనాని సెటైర్

  • నేను అలా చేయను
  • నాకు కులం లేదు
  • మానవత్వమే నా మతం

రాజమండ్రిలో నేటి సాయంత్రం జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సభలో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఈ సభలో ఆయన ప్రసంగం ఆద్యంతం తీవ్రస్థాయిలో సాగింది. గత ఎన్నికల సమయంలో తాను కొందరికి పల్లకీలు మోశానంటూ పరోక్షంగా టీడీపీ, బీజేపీలను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. 2014లో తాను పల్లకీలు మోసింది తన కోసం కాదని, ప్రజలను అభివృద్ధి అనే పల్లకీలో ఏమైనా కూర్చోబెడతారేమో అన్న ఆశతో మోశానని తెలిపారు. కానీ కొందరు తనను వాడుకుని ప్రజలను వంచించారని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన వద్ద డబ్బు లేదని, అయినా ప్రజలకు మేలు చేయాలన్న బలమైన కోరికతో రాజకీయాల్లోకి వచ్చానని స్పష్టం చేశారు.

"గాంధీ వద్ద ఏముందని రంగంలోకి దిగారు? భగత్ సింగ్ వద్ద ఏముందని ముందుకు ఉరికారు? నాకు కులం, ప్రాంతం ఏమీలేవు. కేవలం మానవత్వానికి ప్రతినిధిగా మాత్రమే వచ్చాను. రాయలసీమ ప్రాంతంలో నీకేం బలం ఉందంటారు? అయినా రాయలసీమలో బలం ఉందని చెప్పడానికి రియల్ లైఫ్ లో తొడలు కొట్టి చెప్పాలా? సినిమాల్లో తొడలు కొడితే బాగుంటుంది కానీ రియల్ లైఫ్ లో కాదు. రాయలసీమ అంటే బాంబుల సంస్కృతి అని చెబుతారే తప్ప ఏనాడైనా అన్నమయ్య, తరిగొండ వెంగమాంబ తిరుగాడిన నేల అని ఎవరైనా చెప్పారా? వీరబ్రహ్మేంద్రస్వామికి జన్మనిచ్చిన నేల అది, పీర్ బాబా తిరిగిన నేల అది" అంటూ ఆవేశంగా మాట్లాడారు.


  • Loading...

More Telugu News