Rayapati Sambasiva Rao: రాయపాటికి తీపి కబురు అందించిన అధిష్ఠానం!

  • ఎంపీ స్థానానికి రాయపాటి పేరు ఖరారు
  • సమాచారాన్ని రాయపాటికి అందించిన అధిష్ఠానం
  • అసెంబ్లీకి పరిశీలనలో అరవిందబాబు పేరు

ఎంపీ రాయపాటి సాంబశివరావుకి అధిష్ఠానం తీపి కబురు అందించింది. నరసరావుపేట ఎంపీ స్థానానికి ఆయన పేరు దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని టీడీపీ అధిష్ఠానం రాయపాటికి తెలియజేసినట్టు సమాచారం. ఇంతకు ముందు నరసరావుపేట టికెట్‌ ఇవ్వలేమని టీడీపీ అధిష్ఠానం రాయపాటికి స్పష్టం చేయడంతో.. దీంతో టీడీపీ అధిష్ఠానంపై రాయపాటి అసంతృప్తితో ఉంటూ వస్తున్నారు.

దీంతో నేడు నారా లోకేశ్ ఆయనకు ఫోన్ చేసి తొందరపడవద్దని సూచించారు. ఇంతలోనే మళ్లీ ఆయనకు ఎంపీ స్థానం కేటాయించినట్టు తీపి కబురును అందించారు. అయితే నరసరావుపేట అసెంబ్లీ స్థానానికి స్థానిక డాక్టర్ అరవిందబాబు పేరు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. కానీ ఆయన పేరు ఖరారు చేయడం పట్ల స్థానిక నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరోసారి పున:పరిశీలించాలని అధిష్ఠానాన్ని కోరుతున్నారు.

Rayapati Sambasiva Rao
Telugudesam
Narasaraopet
Aravindababu
Nara Lokesh
  • Loading...

More Telugu News