Pithani Satyanarayana: ఎవరెన్ని మైండ్ గేమ్‌లు ఆడినా.. ప్రలోభాలు పెట్టినా అధికారంలోకి వచ్చేది టీడీపీయే: పితాని

  • తొలి జాబితా సాయంత్రం విడుదల
  • కొన్ని చోట్ల త్రిముఖ పోటీ ఉంది
  • బీసీలు, మహిళలు అండగా ఉన్నారు

120 - 140 మందితో కూడిన టీడీపీ తొలి జాబితా సాయంత్రం విడుదల కానుందని ఏపీ మంత్రి పితాని సత్యనారాయణ తెలిపారు. నేడు ఆయన ఓ ఛానల్‌తో మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలే టీడీపీకి మరోసారి అధికారం కట్టబెడతాయని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ద్విముఖ పోటీతో పాటు.. కొన్ని చోట్ల త్రిముఖ పోటీ కూడా ఉందన్నారు.

రెండు, మూడు రోజుల్లో సీట్ల కేటాయింపు కసరత్తు మొత్తం ఓ కొలిక్కి వస్తుందని.. నిన్నటి నుంచి చంద్రబాబు కొత్తవాళ్లకు టికెట్ కేటాయించే విషయాలను పరిశీలిస్తున్నారన్నారు. బీసీలు, మహిళలు టీడీపీకి అండగా ఉన్నారని పితాని తెలిపారు. ఎవరెన్ని మైండ్ గేమ్‌లు ఆడినా.. ప్రలోభాలకు గురిచేసినా.. సర్వేలు ఇచ్చినా అధికారంలోకి వచ్చేది మాత్రం టీడీపీయేనని ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలే తమను విజయం వైపు నడిపిస్తాయని పితాని ఆశాభావం వ్యక్తం చేశారు.

Pithani Satyanarayana
Chandrababu
Telugudesam
First List
Mind Games
Survey
  • Loading...

More Telugu News