Andhra Pradesh: వైసీపీలో చేరిన దాసరి నారాయణరావు కుమారుడు దాసరి అరుణ్!

  • పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన జగన్
  • వైసీపీ సిద్ధాంతాలు నచ్చాయన్న అరుణ్
  • జగన్ ఆదేశిస్తే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని ప్రకటన

ప్రముఖ దర్శక-నిర్మాత దివంగత దాసరి నారాయణరావు కుమారుడు దాసరి అరుణ్ ఈరోజు వైసీపీలో చేరారు. హైదరాబాద్ లోని జగన్ నివాసానికి చేరుకున్న అరుణ్ పార్టీలో చేరేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలిపారు. దీంతో సానుకూలంగా స్పందించిన జగన్.. వైసీపీ కండువా కప్పి అరుణ్ ను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

అనంతరం దాసరి అరుణ్ మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలు నచ్చడంతోనే వైసీపీలో చేరానని తెలిపారు. వైసీపీ అధినేత జగన్ ఆదేశిస్తే పార్టీ తరఫున రాబోయే ఎన్నికల్లో ప్రచారం చేస్తానని ప్రకటించారు. జయసుధ, రాజారవీంద్ర, అలీ, కృష్ణుడు తదితర టాలీవుడ్ ప్రముఖులు ఇప్పటికే వైసీపీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే.

Andhra Pradesh
Tollywood
dasari narayanarao
dasari arun
YSRCP
Jagan
Hyderabad
joined
  • Loading...

More Telugu News