Andhra Pradesh: టీడీపీకి మరో షాక్.. పార్టీకి రాజీనామా చేసిన ప్రత్తిపాడు ఎమ్మెల్యే సుబ్బారావు!

  • పార్టీలో ప్రాధాన్యత దక్కకపోవడంపై మనస్తాపం
  • త్వరలో వైసీపీలో చేరే అవకాశముందని వార్తలు
  • 2014లో వైసీపీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్న నేత

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార టీడీపీకి మరో షాక్ తగిలింది. తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు ఎమ్మెల్యే, టీడీపీ నేత వరుపుల సుబ్బారావు ఈరోజు పార్టీకి రాజీనామా చేశారు. టీడీపీలో తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో పాటు ప్రత్తిపాడు టికెట్ పై అధిష్ఠానం నుంచి హామీ రాకపోవడంతో సుబ్బారావు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన సన్నిహితవర్గాలు తెలిపాయి.

కాగా, 2014 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ తరఫున గెలుపొందిన సుబ్బారావు, ఎన్నికల అనంతరం టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. మరోవైపు వరుపుల సుబ్బారావు త్వరలోనే వైసీపీలో చేరే అవకాశముందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.  

Andhra Pradesh
Telugudesam
YSRCP
prattipadu
mla
varupula subbarao
  • Loading...

More Telugu News