Andhra Pradesh: బాబూ లీకేష్.. డాడీని అడిగి ట్యూషన్ పెట్టించుకో.. నారా లోకేశ్ పై కన్నా సెటైర్లు!

  • బీజేపీ-వైసీపీ చేతులు కలిపాయన్న లోకేశ్
  • సూట్ కేసులు మార్చేవారికి రాజ్యాంగం విశిష్టత తెలియదన్న కన్నా
  • తండ్రిని అడిగి ట్యూషన్ పెట్టించుకోవాలని హితవు

కేసుల నుంచి బయటపడటానికి జగన్ ప్రధాని మోదీతో చేతులు కలిపారని ఏపీ మంత్రి నారా లోకేశ్ విమర్శించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ మంత్రి నారా లోకేశ్ పై బీజేపీ రాష్ట్ర చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ సెటైర్లు వేశారు. భారత రాజ్యాంగం, ఎన్నికల వ్యవస్థ లోకేశ్ ఊహకు కూడా అందని విషయమని వ్యాఖ్యానించారు. ఇలాంటి పెద్ద విషయాలు తెలుసుకోవాలంటే డాడీని (చంద్రబాబు) అడిగి ట్యూషన్ పెట్టించుకోవాలని సూచించారు.

ఈరోజు ట్విట్టర్ లో కన్నా లక్ష్మీనారాయణ స్పందిస్తూ..‘బాబూ లీకేష్.. భారత రాజ్యాంగం, ఎన్నికల వ్యవస్థ విశిష్టమైనవి. నీ ఊహకు అందనంత పెద్దవి. ప్రతీ వ్యక్తి ఎవరినైనా కలిసి ఓటు అడిగే హక్కు ఉందని నీకు తెలియదేమో. చీకట్లో సూట్ కేసులు మార్చే నీకు ఇలాంటి పెద్ద విషయాలు తెలియాలంటే డాడీని అడిగి ట్యూషన్ పెట్టించుకో(ఎలాగో ఎన్నికల తరువాత ఖాళీనేగా)’ అంటూ సెటైర్లు వేశారు.

Andhra Pradesh
Chandrababu
Nara Lokesh
Telugudesam
BJP
kanna
Jagan
YSRCP
  • Loading...

More Telugu News