Telangana: టీఆర్ఎస్ లో సయోధ్య.. తీగల కృష్ణారెడ్డితో మాజీ హోంమంత్రి సబిత భేటీ!

  • ఇటీవల కేసీఆర్ తో సబిత భేటీ
  • త్వరలోనే టీఆర్ఎస్ లో చేరనున్న మాజీ హోంమంత్రి 
  • కృష్ణారెడ్డి ఇంటికి వెళ్లిన సబిత 

లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి తన కుమారులతో కలిసి నిన్న సీఎం కేసీఆర్ తో సమావేశమయ్యారు. తాజాగా మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డితో సబిత భేటీ అయ్యారు. అనుచరులు, మద్దతుదారులతో కలసి తీగల ఇంటికి వెళ్లిన సబిత.. పలు అంశాలపై ముచ్చటించారు.

గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహేశ్వరం నుంచి పోటీచేసిన సబిత, తీగలపై విజయం సాధించారు. తాజాగా ఆమె టీఆర్ఎస్ లో చేరనున్న నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డితో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Telangana
Congress
TRS
home minister
tegala krishnareddy
sabita indra reddy
  • Loading...

More Telugu News