tiger shroff: వాళ్లిద్దరూ పెళ్లి చేసుకుంటారో, స్నేహితుల్లా మిగిలిపోతారో ఎవరికి తెలుసు?: జాకీ ష్రాఫ్

  • నా కుమారుడు తొలి సారి ఒక అమ్మాయితో స్నేహం చేశాడు
  • ఇద్దరూ కలసి అభిప్రాయాలను పంచుకుంటున్నారు
  • ఆర్మీ ఆఫీసర్ కుటుంబం నుంచి వచ్చిన ఆమెకు డిసిప్లిన్ విలువ ఏమిటో తెలుసు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్, నటి దిశా పఠానీలు ప్రేమలో ఉన్నారనే వార్తలు బాలీవుడ్ లో హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ అంశంపై టైగర్ ష్రాఫ్ తండ్రి, ప్రముఖ నటుడు జాకీ ష్రాఫ్ స్పందించారు.

'నా కుమారుడు అతని జీవితంలో తొలిసారి ఒక 25 ఏళ్ల అమ్మాయితో స్నేహం చేశాడు. అంతకు ముందు ఎవరి వైపూ చూడలేదు. ఇద్దరూ కలసి అభిప్రాయాలను పంచుకుంటున్నారు. డ్యాన్సులు, వర్కౌట్లు కలసి చేస్తున్నారు. ఒక ఆర్మీ ఆఫీసర్ కుటుంబం నుంచి ఆ అమ్మాయి వచ్చింది. అందువల్ల డిసిప్లిన్ కు ఉన్న విలువేంటో ఆమెకు తెలుసు. వాళ్లిద్దరూ పెళ్లి చేసుకుంటారో, లేదా జీవితాంతం స్నేహితుల్లాగే ఉంటారో... ఎవరికి తెలుసు? ఇప్పటికైతే వారిద్దరూ స్నేహితులు మాత్రమే' అని జాకీ ష్రాఫ్ స్పందించాడు.

tiger shroff
jackie shroff
disha patani
bollywood
  • Loading...

More Telugu News