Andhra Pradesh: జమ్మలమడుగులో ఉద్రిక్తత.. వైసీపీ ప్రచారాన్ని అడ్డుకున్న మంత్రి ఆదినారాయణరెడ్డి గ్రూపు!

  • సుగుమంచిపల్లె, ధర్మాపురంలో వైసీపీ ప్రచారం
  • పోటాపోటీగా నినాదాలు చేసిన టీడీపీ-వైసీపీ శ్రేణులు
  • ఇరువర్గాలను శాంతింపజేసిన పోలీసులు

ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లాలో ఈరోజు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. జమ్మలమడుగు నియోజకవర్గంలోని సుగుమంచిపల్లె, ధర్మాపురంలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన వైసీపీ నేతలు అవినాశ్ రెడ్డి, సుధీర్ రెడ్డిని మంత్రి ఆదినారాయణ రెడ్డి వర్గీయులు అడ్డుకున్నారు. అక్కడి నుంచి వెనక్కి వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జగన్ డౌన్ డౌన్, వైసీపీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.

దీంతో పోటీగా వైసీపీ శ్రేణులు జై జగన్ అంటూ నినాదాలతో హోరెత్తించాయి. దీంతో అక్కడ పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. ఈ నేపథ్యంలో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలను శాంతింపజేశారు. అనంతరం పోలీసుల పర్యవేక్షణలో వైసీపీ నేతలు తమ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

Andhra Pradesh
Kadapa District
YSRCP
Telugudesam
jammalamaudgu
tension
Police
  • Loading...

More Telugu News