Andhra Pradesh: విజయవాడ ఏటీఎం కేంద్రంలో అగ్నిప్రమాదం.. కాలిబూడిదైన ఏటీఎం యంత్రాలు!

  • నగరంలోని బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద ఘటన
  • అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోగానే దగ్ధం 
  • షార్ట్ సర్క్యూటే కారణమని భావిస్తున్న పోలీసులు

ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో ఈరోజు అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నగరంలోని బెంజ్ సర్కిల్ సమీపంలో ఉన్న బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం సెంటర్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అధికారులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.

కానీ అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకునేటప్పటికే ఏటీఎం కేంద్రంలోని యంత్రాలు దగ్ధం అయ్యాయి. ఈ విషయమై పోలీస్ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. బ్యాంక్ పక్కనే ఉన్న ట్రాన్స్ ఫార్మర్ పేలడంతోనే ఈ ప్రమాదం చోటుచేసుకుందని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.

Andhra Pradesh
Vijayawada
bank of india
Fire Accident
atm centre
  • Loading...

More Telugu News