thota narasimham: వైసీపీలో చేరిన తోట నరసింహం ఆరోపణలకు దీటైన సమాధానం ఇచ్చిన టీడీపీ

  • వైసీపీలో చేరిన తోట నరసింహం
  • ఆరోగ్యం బాగోలేనప్పుడు టీడీపీ నేతలు పరామర్శించలేదంటూ విమర్శలు
  • నారా లోకేష్ పరామర్శించిన ఫొటోలను బయటపెట్టిన టీడీపీ

ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. జంప్ జిలానీలు అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు జంప్ చేస్తున్నారు. టీడీపీ ఎంపీ తోట నరసింహం తన భార్య వాణితో కలసి నిన్న జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, టీడీపీపై విమర్శలు గుప్పించారు. టీడీపీలో తనను అవమానించారని... తన ఆరోగ్యం బాగోలేనప్పుడు కనీసం పరామర్శించలేదని మండిపడ్డారు. టీడీపీ నేతల వ్యవహారశైలితో తాను తీవ్ర మనస్తాపానికి గురయ్యానని... అందుకే పార్టీని వీడుతున్నానని చెప్పారు.

ఈ నేపథ్యంలో, తోట నరసింహం వ్యాఖ్యలకు టీడీపీ దీటుగా సమాధానమిచ్చింది. తోట నరసింహం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పుడు టీడీపీ నేతలతో కలసి మంత్రి నారా లోకేష్ పరామర్శించిన ఫొటోలను విడుదల చేసింది. ఈ చిత్రంలో ఎంపీ రామ్మోహన్ నాయుడు కూడా ఉన్నారు. నారా లోకేష్ స్వయంగా పరామర్శించినప్పటికీ... తప్పుడు విమర్శలు చేయడం తోట నరసింహం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని టీడీపీ వ్యాఖ్యానించింది.

thota narasimham
ysrcp
Telugudesam
nara lokesh
  • Loading...

More Telugu News