Bhim Army: వచ్చే ఎన్నికల్లో వారణాసి నుంచి మోదీ ఎలా గెలుస్తారో చూస్తా: భీం ఆర్మీ చీఫ్

  • మోదీపై నేనే బరిలోకి దిగుతా
  • ఆయనను మాత్రం గెలవనిచ్చేది లేదు
  • ముస్లిం, దళిత్, ఓబీసీ సోదరులను బలికానివ్వను

గత ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించిన ప్రధాని నరేంద్రమోదీని ఈసారి ఓడించడమే తన లక్ష్యమని భీం ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ తేల్చి చెప్పారు. ప్రధానిని ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవనిచ్చేది లేదని పేర్కొన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

మోదీపై బలహీన అభ్యర్థిని ఎక్కడ నిలబెడతారో అన్న ఆందోళనగా ఉందన్న ఆజాద్ ముస్లిం, దళిత్, ఓబీసీ సోదరులను ఇక బలికానివ్వనని, తానే బరిలోకి దిగుతానని స్పష్టం చేశారు. మోదీపై ఎవరైనా బలహీన అభ్యర్థి బరిలోకి దిగితే ఆయన గెలుపు నల్లేరు మీద నడకే అవుతుందన్నారు. ఇటీవల కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వచ్చి తన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారని, ఆమెను తాను ఆహ్వానించలేదని ఆజాద్ తెలిపారు.

Bhim Army
Chandrashekhar Azad
Narendra Modi
Varanasi
Lok Sabha
Uttar Pradesh
  • Loading...

More Telugu News