west mumbai: 'మా అమ్మ చనిపోతే నీకు ఆనందంగా ఉందా?' అంటూ భార్యను మేడపై నుంచి తోసేసిన భర్త!

  • అత్త మృతిపై ఆనందాన్ని మాటల్లో వ్యక్తం చేసిన భార్య
  • తట్టుకోలేకపోయిన భర్త
  • మహారాష్ట్రలో చోటు చేసుకున్న ఘటన

అనారోగ్యంతో బాధపడుతున్న అతని తల్లి చనిపోయింది. అతను తీవ్ర విషాదంలో కూరుపోయాడు. ఆ సమయంలో ఊరటనివ్వాల్సిన భార్య అత్త చనిపోవడంపై ఆనందం వ్యక్తం చేయడంతో తట్టుకోలేకపోయాడు. ఆగ్రహంతో ఆమెను రెండంతస్తుల మేడపై నుంచి తోసేశాడు. పశ్చిమ మహారాష్ట్రలోని జునారాజ్‌వాడ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మార్చి 9న జరిగిన ఈ దుర్ఘటనకు సంబంధించి పోలీసులు కూపీలాగి వాస్తవాలను బయటపెట్టారు. పోలీసుల కథనం మేరకు... నగరానికి చెందిన సందీప్‌ లోఖండే, శుభంగి లోఖండే (35)లు దంపతులు. సందీప్‌ తల్లి మాలతి కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతోంది.

ఆమె మార్చి 9వ తేదీన తీవ్ర అస్వస్థురాలై తుదిశ్వాస విడిచింది. తల్లి మరణం సందీప్‌ను విషాదంలోకి నెట్టేసింది. అటువంటి సమయంలో భార్య అత్త మరణంపై తన మాటల్లో ఆనందం వ్యక్తం చేయడంతో పట్టరాని కోపాన్ని తెచ్చింది. 'నా తల్లి చనిపోతే నీకు ఆనందంగా ఉందా’ అంటూ ఆగ్రహంతో శుభంగిని మేడపై నుంచి తోసేశాడు. రెండంతస్తులపై నుంచి పడడంతో శుభంగి అక్కడికక్కడే చనిపోయింది.

తొలుత శుభంగిది ఆత్మహత్యగా భావించారు. స్థానిక మీడియా కూడా ‘అత్త మరణం తట్టుకోలేక కోడలి ఆత్మహత్య’ అనే రాశాయి. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసి దర్యాప్తు చేయగా అసలు విషయం బయటకు వచ్చింది. సందీప్‌ మేడపై నుంచి తోసేయడం వల్లే శుభంగి మృతి చెందిందని నిగ్గు తేల్చారు.

west mumbai
Crime News
housewife murdered
  • Loading...

More Telugu News