Ganta Srinivasa Rao: జగన్ కు మంచీ లేదు, మానవత్వం లేదు... చంద్రబాబు రాజకీయాల్లో ఉన్నంతకాలం ఆయన వెంటే: గంటా

  • అనుమానాలు పటాపంచలు చేసిన ఏపీ మంత్రి
  • వైసీపీపై మండిపాటు
  • విలువల్లేని రాజకీయాలు చేస్తోందంటూ విమర్శలు

ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రతిపక్ష నేత జగన్ పై నిప్పులు చెరిగారు. జగన్ కు మంచీ మానవత్వం లేవని విమర్శించారు. ఎన్నికల నేపథ్యంలో జగన్ మైండ్ గేమ్ ఆడుతున్నారంటూ విమర్శించారు. తాను చంద్రబాబు దగ్గర ఉంటే జగన్ దగ్గర ఉన్నట్టు ప్రచారం చేశారని మండిపడ్డారు. వైసీపీ విలువల్లేని రాజకీయాలు చేస్తోందంటూ, చంద్రబాబు రాజకీయాల్లో ఉన్నంత కాలం తాను ఆయన వెంటే ఉంటానని గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు.

అంతకుముందు, మంత్రి గంటా శ్రీనివాసరావు టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరుతున్నట్టు మీడియాలో వార్తలొచ్చాయి. 'అజ్ఞాతంలో గంటా', 'చంద్రబాబుపై గంటా అలక' అంటూ బ్రేకింగ్ న్యూస్ కూడా ఓ చానల్ లో దర్శనమిచ్చింది. అయితే, అదే సమయంలో ఏపీ మంత్రి నారా లోకేష్... గంటాతో ఓ సెల్ఫీ దిగి ఆ చానల్ కు ఝలక్ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే గంటా వివరణ ఇచ్చినట్టు అర్థమవుతోంది.

Ganta Srinivasa Rao
Telugudesam
Chandrababu
Nara Lokesh
Jagan
YSRCP
  • Loading...

More Telugu News