Chandrababu: టీడీపీలో చేరిన వంగవీటి రాధా.. పెద్ద ఎత్తున హాజరైన అభిమానులు

  • కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన చంద్రబాబు
  • తాజాగా చంద్రబాబుతో రెండు సార్లు భేటీ
  • నిన్న టీడీపీలో చేరుతున్నట్టు ప్రకటన

మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ నేడు టీడీపీలో చేరారు. రాధాను టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసంలో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇటీవల వైసీపీని వీడిన రాధా.. సోమవారం అర్ధరాత్రి చంద్రబాబుతో భేటీ అయి దాదాపు రెండు గంటలపాటు చర్చించారు. అనంతరం నిన్న మరోసారి భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలోనే తాను టీడీపీలో చేరుతున్నట్టు ఆయన స్ఫష్టం చేశారు. రాధా చేరిక సందర్భంగా పెద్ద సంఖ్యలో అభిమానులు, టీడీపీ కార్యకర్తలు చంద్రబాబు నివాసానికి తరలి వచ్చారు. ఆయనతో పాటు నేడు ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన వైసీపీ నేత యడం బాలాజీ కూడా టీడీపీలో చేరారు.

Chandrababu
Vangaveeti Radhakrishna
Telugudesam
Vundavalli
Yadam Balaji
YSRCP
  • Loading...

More Telugu News