Chandrababu: ఎవరి అండతో చంద్రబాబు ఓటుకు నోటు కేసును రాజీ చేసుకున్నారో చెప్పాలి: సోము వీర్రాజు

  • పదవీకాంక్ష తప్ప ప్రజా సంక్షేమం పట్టదు
  • చంద్రబాబు ఎందుకు పారిపోవాల్సి వచ్చింది?
  • ఏపీ రాజకీయాలను భ్రష్టు పట్టించారు

టీడీపీ అధినేత చంద్రబాబుకు పదవీకాంక్ష తప్ప ప్రజా సంక్షేమం పట్టదని బీజేపీ నేత సోము వీర్రాజు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ పదేళ్లు ఉన్నప్పటికీ, చంద్రబాబు ఎందుకు పారిపోవాల్సి వచ్చిందని నిలదీశారు. ఎవరి అండతో ఓటుకు నోటు కేసులో రాజీ చేసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు వ్యవస్థలను తన చేతిలో పెట్టుకునేందుకు ఆరాపడుతుంటారని, ఏపీ రాజకీయాలను భ్రష్టు పట్టించారని సోము వీర్రాజు మండిపడ్డారు.

Chandrababu
Somu Veerraju
Hyderabad
Note for Vote
Andhra Pradesh
  • Loading...

More Telugu News