Andhra Pradesh: చంద్రబాబు బుజ్జగింపులతో వెనక్కు తగ్గిన మంత్రి శిద్ధా.. ఒంగోలు లోక్ సభ నుంచి పోటీకి సై!

  • దర్శి నుంచి పోటీ చేస్తానని తొలుత చెప్పిన శిద్ధా 
  • ఉగ్ర నరసింహారెడ్డి పేరును ప్రకటించిన చంద్రబాబు
  • నేడు శిద్ధాతో చర్చలు జరిపి ఒప్పించిన టీడీపీ అధినేత

ఆంధ్రప్రదేశ్ మంత్రి, టీడీపీ నేత శిద్ధా రాఘవరావు ఎట్టకేలకు వెనక్కి తగ్గారు. రాబోయే ఎన్నికల్లో ఒంగోలు లోక్ సభ స్థానం నుంచి పోటీచేయాలని చంద్రబాబు నచ్చజెప్పడంతో ఆయన అంగీకరించారు. నిన్న ఏపీ సీఎంతో సమావేశమైన శిద్ధా.. తాను లోక్ సభ స్థానానికి పోటీ చేస్తానంటే ప్రజలు, మద్దతుదారులు అంగీకరించడం లేదని చెప్పారు. దర్శి ఎమ్మెల్యేగా మరోసారి పోటీచేయాలని ప్రజలు కోరుతున్న విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు దర్శి అసెంబ్లీ టీడీపీ అభ్యర్థిగా ఉగ్ర నరసింహారెడ్డి పేరును ఖరారు చేశారు. దీంతో ఈరోజు శిద్ధా ముఖ్యమంత్రితో సమావేశమై మరోసారి చర్చలు జరిపారు. చంద్రబాబు ఆదేశాల మేరకు ఈసారి ఒంగోలు లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు ఆయన అంగీకరించారు. 

Andhra Pradesh
Chandrababu
Telugudesam
sidda raghavarao
ongole loksabha seat
darsi assembly seat
  • Loading...

More Telugu News