Andhra Pradesh: రెండు సీట్లు అడుగుతున్నాం.. ఒకవేళ కుదరదంటే మా అబ్బాయి కోసం నేను తప్పుకుంటాను!: పరిటాల సునీత

  • అభిమానుల కోరిక మేరకు శ్రీరామ్ పోటీ
  • చంద్రబాబు నిర్ణయం మేరకు ముందుకెళతాం
  • అనంతపురంలో మీడియాతో ఏపీ మంత్రి

టీడీపీ నేత, ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత కీలక ప్రకటన చేశారు. అభిమానుల కోరిక మేరకు రాబోయే ఎన్నికల్లో తన కుమారుడు పరిటాల శ్రీరామ్ పోటీ చేస్తారని ప్రకటించారు. ఏపీ ఎన్నికల్లో పోటీచేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబును రెండు సీట్లు అడుగుతున్నామని వెల్లడించారు. అనంతపురంలో ఈరోజు మీడియాతో మంత్రి సునీత మాట్లాడారు.

ఒకవేళ రెండు సీట్లు ఇవ్వని పక్షంలో రాప్తాడు నియోజకవర్గం నుంచి పరిటాల శ్రీరామ్ పోటీ చేస్తారని పేర్కొన్నారు. తాను తప్పుకుంటానని వ్యాఖ్యానించారు.  ఈ విషయంలో తమ నిర్ణయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళతామని పరిటాల సునీత తెలిపారు. పార్టీ అధినేత నిర్ణయం మేరకు ముందుకు వెళతామని స్పష్టం చేశారు.

Andhra Pradesh
Chandrababu
Telugudesam
paritala sunitha
sriram
  • Loading...

More Telugu News