Andhra Pradesh: నరసరావుపేటపై వంగవీటి రాధ కన్ను.. నేడు టీడీపీలో చేరిక!

  • ఇటీవల వైసీపీని వీడిన వంగవీటి రాధ
  • ఈరోజు సాయంత్రం టీడీపీ తీర్థం
  • అనకాపల్లి, నరసరావుపేట స్థానాలు ఆఫర్ చేసిన చంద్రబాబు

పార్టీలో తగిన గౌరవం దక్కలేదంటూ వంగవీటి రాధాకృష్ణ ఇటీవల వైసీపీకి రాజీనామా సమర్పించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వంగవీటి రాధాకృష్ణ ఈరోజు టీడీపీలో చేరనున్నారు. టీడీపీలో చేరికపై పార్టీ అధినేత చంద్రబాబుతో ఇప్పటికే రాధ చర్చించారు. తాజాగా ఈరోజు సాయంత్రం ఉండవల్లిలోని ప్రజావేదికలో చంద్రబాబు సమక్షంలో వంగవీటి రాధాకృష్ణ టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం.

కాగా, రాబోయే ఎన్నికల్లో నరసరావుపేట లేదా అనకాపల్లి లోక్ సభ స్థానాన్ని వంగవీటి రాధాకృష్ణకు ఇచ్చేందుకు టీడీపీ అధిష్ఠానం హామీ ఇచ్చినట్లు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. అయితే నరసరావుపేట స్థానం నుంచి పోటీచేసేందుకే రాధ మొగ్గుచూపుతున్నారని అంటున్నారు. 

Andhra Pradesh
Telugudesam
vangaveeti radha
YSRCP
Chandrababu
joined
Jagan
narasarao peta
anakapalli
  • Loading...

More Telugu News