YSRCP: అభ్యర్థుల జాబితా వాయిదాకు అసలు కారణం ఇదే: మీడియాకు వైసీపీ ప్రకటన

  • చేరికలు అధికంగా ఉన్నాయి
  • జగన్ వారిని ఆహ్వానిస్తూ బిజీగా ఉన్నారు
  • ఈలోగా ముహూర్తం దాటిపోయిందని వెల్లడి

నేడు విడుదల కావాల్సిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ, లోక్ సభ అభ్యర్థుల జాబితాను 16వ తేదీకి వాయిదా వేసిన కారణాన్ని తెలుపుతూ ఆ పార్టీ ప్రతినిధులు మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. తొలుత నేడు జాబితాను బహిర్గతం చేయాలని భావించామని, అయితే, పార్టీలో చేరికలు అధికంగా ఉన్నందున, వారిని ఆహ్వానిస్తూ, వైఎస్ జగన్ బిజీగా ఉండటంతో మంచి సమయం దాటిందని పేర్కొంది. ఇవాళ ముహూర్తం దాటిపోయినందునే జాబితా విడుదలను వాయిదా వేశామని, ఇప్పటికే సిద్ధమైన జాబితాను మార్చేది లేదని వెల్లడించింది. ఇడుపులపాయలో జగన్ స్వయంగా జాబితాను మీడియాకు అందిస్తారని తెలిపింది. ఆ వెంటనే జగన్ ప్రచార యాత్ర మొదలవుతుందని వెల్లడించింది. 

YSRCP
Candidates
Media Release
Jagan
  • Loading...

More Telugu News