Twitter: 'గంటా అలక' అని 'సాక్షి'లో న్యూస్ వస్తుంటే... లోకేశ్ తో గంటా సెల్ఫీ!

  • ట్విట్టర్ లో ఫోటో పెట్టిన సీఎం రమేష్
  • వెనుకాల 'సాక్షి' న్యూస్ చానల్
  • నవ్వుతూ సెల్ఫీ దిగిన నేతలు

వైఎస్ జగన్ మీడియా 'సాక్షి' న్యూస్ చానల్ లో తప్పుడు వార్తలు ప్రసారం అవుతున్నాయని చెబుతూ, ఎంపీ సీఎం రమేష్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసుకున్న ఓ ఫోటో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది.

"గంటా శ్రీనివాసరావు అలక" అని గ్రాఫిక్ ప్లేట్ పై కనిపిస్తున్న టీవీ ముందు నిలబడి లోకేశ్, గంటా శ్రీనివాసరావులు సెల్ఫీ దిగగా, దాన్ని సీఎం రమేష్ షేర్ చేశారు. భీమిలి టికెట్ విషయంలో గంటా చాలా ఆగ్రహంగా ఉన్నారని, గత రాత్రి నుంచి ఆయన అదృశ్యం అయ్యారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఫోటోతో అది అసత్యమని తేలిపోయింది. ఆ ఫోటోను మీరూ చూడవచ్చు.

Twitter
Nara Lokesh
Ganta Srinivasa Rao
Selfy
CM Ramesh
  • Error fetching data: Network response was not ok

More Telugu News