Andhra Pradesh: శంషాబాద్ ఎయిర్ పోర్టులో నకిలీ వీసాల కలకలం.. 26 మంది మహిళల అరెస్ట్!

  • కువైట్ కు నకిలీ వీసాలతో 26 మంది మహిళలు
  • సాధారణ తనిఖీల్లో బయటపడ్డ వైనం
  • సూత్రధారుల కోసం పోలీసుల వేట

హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఈరోజు కలకలం చెలరేగింది. సాధారణ తనిఖీల్లో భాగంగా అధికారులు ప్రయాణికుల వీసాలను పరిశీలించగా, 26 మంది మహిళలు నకిలీ వీసాలతో కువైట్ కు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లు తేలింది. దీంతో వీరందరినీ అధికారులు అరెస్ట్ చేశారు.

అనంతరం ఈ 26 మందిని ఎయిర్ పోర్టు పోలీసులకు అప్పగించారు. ఈ నేపథ్యంలో కేసు నమోదుచేసిన పోలీసులు.. ఈ నకిలీ వీసాల వెనుకున్న సూత్రధారులను అరెస్ట్ చేసేందుకు విచారణను ముమ్మరం చేశారు.

Andhra Pradesh
Telangana
FAKE VISA
26 WOMEN
  • Loading...

More Telugu News