Visakhapatnam District: నాకు టిక్కెట్టు వద్దు...నేను విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నా: చంద్రబాబు వద్ద మంత్రి అయ్యన్న ప్రతిపాదన

  • తన కొడుక్కి నర్సీపట్నం టికెట్టు ఇవ్వాలని విజ్ఞప్తి
  • కనీసం అనకాపల్లి ఎంపీ టికెట్టు అయినా ఇవ్వాలని వేడుకోలు
  • ఆలోచించి నిర్ణయం చెబుతానన్న అధినేత

రానున్న ఎన్నికల్లో తాను పోటీ చేయలేనని, రాజకీయ విశ్రాంతి తీసుకోవాలని కోరుకుంటున్నట్లు విశాఖ జిల్లా నర్సీపట్నం ఎమ్మెల్యే, మంత్రి అయ్యన్నపాత్రుడు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు తెలిపారు. బదులుగా తన కొడుకు విజయ్‌కి నర్సీపట్నం టికెట్టు కేటాయించాలని కోరారు. ఈరోజు అమరావతిలో చంద్రబాబుతో భేటీ అయిన అయ్యన్నపాత్రుడు ఈ మేరకు ప్రతిపాదన చేశారు.

దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి ఈసారికి మీరే పోటీ చేయాలని కోరగా, తన కొడుకుకి టికెట్టు ఇచ్చినా గెలిపించే బాధ్యతను తాను తీసుకుంటానని స్పష్టం చేసినట్లు సమాచారం. నర్సీపట్నం ఎమ్మెల్యే టికెట్టు ఇవ్వలేని పక్షంలో అనకాపల్లి ఎంపీ టికెట్టు అయినా తన కొడుక్కి ఇవ్వాలని అయ్యన్న బాబు ముందు ప్రతిపాదించగా, తనకు రెండు రోజుల సమయం ఇస్తే ఆలోచించి నిర్ణయం చెబుతానని చంద్రబాబు స్పష్టం చేసినట్లు సమాచారం.

Visakhapatnam District
narsipatnam
Ayyanna Patrudu
Chandrababu
  • Loading...

More Telugu News