Rajaravindra: రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేస్తా... టికెట్ అడగలేదు: వైసీపీలో చేరిన తరువాత నటుడు రాజారవీంద్ర

  • విస్తృతంగా ప్రచారం చేస్తా
  • ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం లేదు
  • జగన్ ఏ బాధ్యతలు ఇచ్చినా స్వీకరిస్తానన్న రాజా రవీంద్ర

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రానున్న ఎన్నికల్లో తాను రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా తిరిగి ప్రచారం చేయనున్నానని సినీ నటుడు రాజారవీంద్ర వ్యాఖ్యానించారు. ఈ ఉదయం వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, తనకు ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం లేదని, టికెట్ ఇవ్వాలని తాను అడగలేదని చెప్పారు.

జగన్ ను ముఖ్యమంత్రిగా చూడటమే తన లక్ష్యమని అన్నారు. సినీ నటులు అలీ, కృష్ణుడు తదితరులు తనకెంతో దగ్గరి మిత్రులని, అందరమూ కలిసి ప్రచార షెడ్యూల్ ను నిర్ణయించుకుంటామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమైన విభజన హామీ, ప్రత్యేక హోదా రావాలంటే వైసీపీ అధికారంలోకి రావాల్సివుందని రాజారవీంద్ర అభిప్రాయపడ్డారు. పార్టీ అధినేతగా వైఎస్ జగన్ ఏ బాధ్యతలు అప్పగించినా స్వీకరిస్తానని అన్నారు.

Rajaravindra
YSRCP
Jagan
  • Loading...

More Telugu News