Andhra Pradesh: ఏపీకి చేరుకున్న టీఆర్ఎస్ కార్లు.. వైసీపీ ప్రచారానికి సిద్ధం!
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-89635b9e65c47887672c9a7c7c7ff8bdc651061c.jpg)
- నెల్లూరుకు చేరుకున్న పలు వాహనాలు
- స్టిక్కర్లు మార్చుతున్న వైసీపీ నేతలు
- సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తమను ఓడించేందుకు వైసీపీ-టీఆర్ఎస్ చేతులు కలిపాయని అధికార టీడీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇందుకు బలం చేకూర్చే ఘటన ఒకటి నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. గతేడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ నేతలు వాడిన కార్లు తాజాగా నెల్లూరు జిల్లాకు చేరుకున్నాయి.
![](https://img.ap7am.com/froala-uploads/froala-962accb5f325c6d33cdf8dda10dff76a4ad12a6d.jpg)