Malladi Vishnu: టీడీపీ వారిని చిత్తు చిత్తుగా ఓడించే జాబితా రెడీ: మల్లాది విష్ణు

  • మరికాసేపట్లో వైసీపీ తొలి జాబితా
  • జాబితాలోని వారంతా గెలుపుగుర్రాలే
  • రెండు రోజుల్లో రెండో జాబితా

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులను చిత్తు చిత్తుగా ఓడించే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాబితా రెడీగా ఉందని ఆ పార్టీ నేత మల్లాది విష్ణు వ్యాఖ్యానించారు. ఈ ఉదయం లోటస్ పాండ్ వద్ద మీడియాతో మాట్లాడిన ఆయన, దాదాపు 100 మందికిపైగా పేర్లతో నేడు వైసీపీ తొలి జాబితాను విడుదల చేయనున్నామని చెప్పారు. ఈ జాబితాలోని వారంతా గెలుపుగుర్రాలేనని చెప్పడంలో సందేహం లేదని, అందరూ ఘన విజయం సాధించగల సత్తా ఉన్నవారేనని అన్నారు. రెండు రోజుల్లో మిగతా జాబితాను ఖరారు చేసి, ఆపై ఎన్నికల ప్రచారంలోకి జగన్ వెళ్లనున్నారని అన్నారు. అధికార పార్టీ కన్నా ఒకడుగు ముందే వైసీపీ తన జాబితాను విడుదల చేయనుందని చెప్పారు.

Malladi Vishnu
YSRCP
First List
Elections
Andhra Pradesh
  • Loading...

More Telugu News