India: తనను పట్టించుకోకుండా టీవీ సీరియల్స్ చూస్తోందని.. భార్యను రాడ్డుతో చితక్కొట్టిన భర్త!

  • మహారాష్ట్రలోని పూణేలో ఘటన
  • కుమారుడి విషయంలో భార్యాభర్తల మధ్య వివాదం
  • హత్యచేయబోయాడని పోలీసులకు భార్య ఫిర్యాదు

చిన్నగొడవ చిలికిచిలికి గాలివానగా మారింది. తనను పట్టించుకోకుండా భార్య టీవీ సీరియల్స్ చూడటంతో మనస్తాపానికి గురైన ఓ భర్త రెచ్చిపోయాడు. పక్కనే ఉన్న రాడ్డుతో ఆమెపై విచక్షణారహితంగా దాడిచేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ ఆమెను ఆసుపత్రికి తరలించారు. మహారాష్ట్రలోని పూణేలో గత సోమవారం చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పూణేలోని సాలిస్‌బరిలో వుండే ఆసిఫ్ సత్తార్ హోర్డింగ్స్ వ్యాపారం చేస్తున్నాడు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే కుమారుడు లీకైన పాల ప్యాకెట్ తీసుకురావడంతో భార్య పిల్లాడిని కసురుకుంది. దీంతో సత్తార్ భార్యను మందలించాడు. ఈ నేపథ్యంలో భర్తపై అలిగిన ఆమె ఇంట్లోకి వెళ్లి పడుకుంది. పనికి వెళ్లి రాత్రి ఇంటికి వచ్చినప్పటికీ సత్తార్ ను పట్టించుకోకుండా పాకిస్థానీ సీరియల్స్ చూస్తూ పడుకుంది.

దీంతో సహనం కోల్పోయిన సత్తార్ పక్కనే ఉన్న ఓ రాడ్డును తీసుకొచ్చి ఆమెపై విచక్షణారహితంగా దాడిచేశాడు. ఈ ఘటనలో భార్య కుడిచేతి వేలు విరిగిపోయింది. కాగా, తన భర్త తనను చంపేందుకు యత్నించాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. భార్య ఫిర్యాదుతో కేసు నమోదుచేసిన పోలీసులు.. భర్త సత్తార్ ను అరెస్ట్ చేశారు.

India
Pakistan
TV SERIALS
HUSBAND
ATTACK
WIFE
ROD ATTACK
Police
Maharashtra
PUNE
  • Loading...

More Telugu News