Mayawati: పోటీకి సిద్ధమవుతున్న మాయావతి మాజీ సెక్రటరీ.. దాడులతో విరుచుకుపడిన ఐటీ

  • ఐఏఎస్ అధికారి నేత్రం మాయావతికి సన్నిహితుడు 
  • వంద కోట్ల పన్ను ఎగవేతకు పాల్పడ్డారన్న అనుమానం 
  • 12 ప్రదేశాల్లో ఏక కాలంలో దాడులు

మాజీ ఐఏఎస్ అధికారి, ఉత్తరప్రదేశ్ మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ నేత్రంకు సంబంధించిన పలు ప్రదేశాల్లో ఆదాయపన్ను శాఖ అధికారులు మంగళవారం దాడులు జరిపారు. కోల్‌కతా, లక్నో, ఢిల్లీలోని 12 ప్రదేశాల్లో ఏక కాలంలో దాడులు నిర్వహించారు. 2007 నుంచి 2012 మధ్య కాలంలో మాయావతి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన నేత్రం.. దాదాపు వంద కోట్ల రూపాయల పన్ను ఎగవేతకు పాల్పడ్డారన్న అనుమానంపై ఐటీ దాడులు జరిగాయి.

బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతికి నేత్రం సన్నిహితుడిగా పేరుపడ్డారు. అంతేకాదు, ఈసారి ఆయన బీఎస్పీ టికెట్‌పై లోక్‌సభకు పోటీ చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఈ నేపథ్యంలో లక్నోలోని ఆయన నివాసంతోపాటు కోల్‌కతా, ఢిల్లీల్లోని కార్యాలయాలపైనా ఐటీ దాడులు నిర్వహించింది. ఈ సందర్భంగా కొన్ని విలువైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News