sidda raghava rao: నేను ఎంపీగా పోటీ చేస్తానంటే వారు ఒప్పుకోవడం లేదు: చంద్రబాబుతో శిద్దా

  • ఎంపీగా పోటీ చేయమని కోరిన చంద్రబాబు
  • కార్యకర్తలు ఒప్పుకోవడం లేదన్న శిద్దా
  • నేడు మరోమారు చంద్రబాబుతో భేటీ

ఈసారి ఎన్నికల్లో తాను ఎంపీగా బరిలోకి దిగుతానంటే కార్యకర్తలు ఒప్పుకోవడం లేదని ఏపీ మంత్రి శిద్దా రాఘవరావు ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలిపారు. రానున్న ఎన్నికల్లో ఎంపీగా బరిలోకి దిగాలంటూ మంత్రికి చంద్రబాబు సూచించారు. అందుకు ససేమిరా అన్న శిద్దా మంగళవారం సీఎంతో భేటీ అయ్యారు.

అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. తాను ఎంపీగా బరిలోకి దిగుతానంటే నియోజకవర్గ కార్యకర్తలు అంగీకరించడం లేదని తెలిపారు. ఎమ్మెల్యేగానే పోటీ చేయాలని పట్టుబడుతున్నారని పేర్కొన్నారు. ఈ విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తే బుధవారం (నేడు) మరోమారు మాట్లాడదామని చెప్పారన్నారు.  తప్పని పరిస్థితుల్లో ఒకవేళ ఎంపీగానే పోటీ చేయాల్సి వస్తే కుటుంబ సభ్యుల అభిప్రాయం కూడా తీసుకుంటానని తెలిపారు.

sidda raghava rao
Andhra Pradesh
Elections
Chandrababu
MP
MLA
  • Loading...

More Telugu News