Rayapati Sambasiva rao: తుది నిర్ణయం తెలుసుకునేందుకు చంద్రబాబు నివాసానికి వెళ్లిన రాయపాటి

  • కొన్ని రోజులుగా అసంతృప్తిలో రాయపాటి
  • టికెట్ల విషయంలో స్పష్టత ఇవ్వని చంద్రబాబు
  • కొడుకు కోసం సత్తెనపల్లి స్థానాన్ని కోరుతున్న రాయపాటి

గుంటూరు జిల్లా నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు గత కొన్ని రోజులుగా అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. నరసరావుపేట పార్లమెంటరీ స్థానానికి తాను.. సత్తెనపల్లి అసెంబ్లీ స్థానం నుంచి తన కుమారుడి చేత పోటీ చేయించాలని రాయపాటి భావిస్తున్నారు. కానీ అధిష్ఠానం దీనిపై ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడంతో ఆయన అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. ఈ విషయమై స్పష్టత కోసం రాయపాటి నేడు టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి వెళ్లారు. చంద్రబాబు తుది నిర్ణయం తెలుసుకునేందుకే ఆయన వెళ్లినట్టు రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మరి ఈ టికెట్ల వ్యవహారంపై చంద్రబాబు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

Rayapati Sambasiva rao
Narasaraopeta
Sathenapalli
Chandrababu
Telugudesam
  • Loading...

More Telugu News