Rajamahendravaram: అనుచరులు ఒప్పుకోకపోవడంతో నిర్ణయం మార్చుకున్న టీడీపీ నేత

  • పెద్దాపురం ఎమ్మెల్యేగా రెండు సార్లు గెలిచిన భాస్కర రామారావు
  • ఈసారి ఎంపీగా పోటీ చేయాలని సూచన
  • దీంతో మౌనం వహించిన భాస్కర రామారావు 

గతంలో పెద్దాపురం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన టీడీపీ నేత బొడ్డు భాస్కర రామారావు మళ్లీ అదే స్థానాన్ని ఆశించారు. కానీ అధిష్ఠానం రాజమహేంద్రవరం పార్లమెంటరీ స్థానాన్ని సూచించింది. దీంతో ఆయన కొన్ని రోజులుగా మౌనం వహించారు. పార్టీని వీడాలని నిర్ణయానికి కూడా వచ్చినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తన అనుచరులతో సమావేశమై.. పార్టీ మారే విషయం చర్చించగా.. మెజారిటీ కార్యకర్తలు పార్టీని వీడేందుకు సమ్మతించలేదని తెలుస్తోంది. దీంతో ఆయన పార్టీలోనే కొనసాగాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అధిష్ఠానం తాజాగా ఆయనకు రాజమహేంద్రవరం పార్లమెంటరీ స్థానాన్ని కేటాయించింది.

Rajamahendravaram
Telugudesam
Boddu Bhaskar Rao
Peddapuram
  • Loading...

More Telugu News