India: ఒక్క రాఫెల్ ఉంటేనా.. పాక్ విమానాల్లో సగం తుడిచిపెట్టుకుపోయేవి: మాజీ ఎయిర్ చీఫ్ ఏవై టిప్నిస్

  • భారత్ కు మరిన్ని స్క్వాడ్రన్లు ఉండాలి
  • రఫేల్ వాయసేన స్థయిర్యాన్ని పెంచుతుంది
  • పాక్ కు అదే సరైన విరుగుడు

భారత్ వద్ద ఒక్క రాఫెల్ యుద్ధ విమానం ఉన్నా మొన్నటి పాకిస్థాన్ వాయుసేన దాడుల్లో తన సత్తా ఏంటో చూపించేందంటున్నారు భారత వాయుసేన మాజీ ఎయిర్ చీఫ్ మార్షల్ ఏవై టిప్నిస్. బాలాకోట్ దాడుల తర్వాత పాకిస్థాన్ శ్రీనగర్, అవంతిపుర మిలిటరీ బేస్ లను లక్ష్యంగా చేసుకుందని చెప్పిన ఆయన, ఆ సమయంలో ఒక్క రాఫెల్ విమానం ఉండుంటే పాకిస్థాన్ పంపించిన 24 ఫైటర్ జెట్లలో సగం విమానాలను తుడిచిపెట్టేదని వ్యాఖ్యానించారు. రాఫెల్ విమానం భారత వాయుసేన ఆత్మస్థయిర్యాన్ని మరింత ఇనుమడింప చేస్తుందని అన్నారు టిప్నిస్.

ఆజ్ తక్ మీడియా సంస్థ నిర్వహించిన భద్రతా సదస్సులో ఆయన కూడా పాల్గొన్నారు. భారత వాయుసేనకు మరిన్ని స్క్వాడ్రన్లు అవసరమని అన్నారు. భారత్ ఉగ్రవాదం విషయంలో మౌనంగా ఉండరాదని, ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు ప్రత్యేక వ్యూహం అవసరమని అన్నారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా స్ట్రాటజీ మార్చుకోకూడదని, కేంద్రంలో ఎవరున్నా ఉగ్రవాదంపై మాత్రం ఏకరీతి పోరాటం చేయాలని సూచించారు.

  • Loading...

More Telugu News