lagadapati: టీడీపీలో చేరే అంశంపై క్లారిటీ ఇచ్చిన లగడపాటి

  • టీడీపీలో చేరబోతున్నారనే ఊహాగానాలకు తెరదించిన లగడపాటి
  • ఏ పార్టీలో చేరబోనంటూ స్పష్టీకరణ
  • రాజకీయ సన్యాసాన్ని కొనసాగిస్తానంటూ వ్యాఖ్య

ఇటీవలి కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబులో మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ పలుమార్లు భేటీ అయిన సంగతి తెలిసిందే. వంగవీటి రాధాకృష్ణతో కలసి నిన్న రాత్రి కూడా చంద్రబాబును లగడపాటి కలిశారు. ఇలాంటి ఘటనల నేపథ్యంలో టీడీపీలో లగడపాటి చేరబోతున్నారనే ప్రచారం ఊపందుకుంది.

ఈ వార్తలపై ఈరోజు లగడపాటి స్పందించారు. విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ, తాను ఏ పార్టీలో చేరబోనని స్పష్టం చేశారు. తన రాజకీయ సన్యాసాన్ని కొనసాగిస్తానని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే రాజకీయ సన్యాసం తీసుకుంటానని అప్పట్లో ప్రకటించిన లగడపాటి... మాటకు కట్టుబడి అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే.

lagadapati
Telugudesam
entry
clarity
  • Loading...

More Telugu News