byreddy rajasekhar reddy: రఘువీరాతో విభేదాలు.. కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన బైరెడ్డి

  • నాలుగు నెలల క్రితమే కాంగ్రెస్ లో చేరిన బైరెడ్డి
  • కర్నూలు డీసీసీ అధ్యక్షుడి నియామకంలో కూడా రఘువీరాతో విభేదాలు
  • ఈ సాయంత్రం రాజీనామా చేసే అవకాశం

ఏపీలో కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. సీనియర్ నేత బైరెడ్డి రాజశేఖరరెడ్డి కాంగ్రెస్ కు గుడ్ బై చెబుతున్నారు. ఈ సాయంత్రం అధికారికంగా కాంగ్రెస్ కు ఆయన రాజీనామా చేయనున్నట్టు సమాచారం. నాలుగు నెలల క్రితమే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డితో విభేదాల కారణంగా బైరెడ్డి రాజీనామా చేస్తున్నారని ఆయన అనుచరులు తెలిపారు. కర్నూలు డీసీసీ అధ్యక్షునిగా అలీఖాన్ నియామకంలో కూడా రఘువీరా నిర్ణయంతో బైరెడ్డి విభేదించారు. ఆయన ఏ పార్టీలో చేరబోతున్నారనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు.

byreddy rajasekhar reddy
raghuveera reddy
congress
Kurnool District
resign
  • Loading...

More Telugu News